తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

యువకుని వేధింపులు తట్టుకోలేక 8వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య - 8th class student died at line tanda in mahabubabad district

మహబూబాబాద్​ జిల్లా గూడూరు మండలం లైన్​తండాలో యువకుని వేధింపులు భరించలేక ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని సమీప వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మనస్తాపానికి గురై చనిపోయిందంటూ మృతురాలి కుటుంబీకులు వేధింపులకు గురిచేసిన యువకుని ఇంటిముందు ధర్నా చేపట్టారు.

student suicide at line tanda due to harassment
యువకుని వేధింపులు తట్టుకోలేక 8వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

By

Published : Sep 24, 2020, 10:32 PM IST

యువకుని వేధింపులు భరించలేక ఎనిమిదో తరగతి విద్యార్థిని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్​ జిల్లా గూడూరు మండలం లైన్​ తండాలో చోటు చేసుకుంది. మండలంలోని దామరంచ శివారు లక్ష్మీ తండాకు చెందిన బాలిక హాస్టల్లో ఉంటూ ఎనిమిదో తరగతి చదువుతోంది. కరోనా మహమ్మారితో హాస్టల్​ మూసివేయగా తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్​ వెళ్లిపోగా.. లైన్​తండాలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటుంది.

గురువారం మేనత్తతో కలిసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి బాలికను అదే తండాకు చెందిన మహేందర్​ అనే యువకుడు తనను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకోమని వేధించగా మనస్తాపానికి గురైన బాలిక బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని మృతదేహంతో మృతురాలి బంధువులు మహేందర్​ ఇంటిముందు ఆందోళనకు దిగారు.

విషయం తెలుసుకున్న ఎస్సై సురేష్​.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక మృతిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్సై సురేష్​ తెలిపారు.

ఇదీ చదవండి :గొంతులో పల్లీ ఇరుక్కుని పదకొండు నెలల చిన్నారి మృతి

ABOUT THE AUTHOR

...view details