తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

'ఆన్‌లైన్‌ తరగతులకు సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని'

ఆన్‌లైన్‌ తరగతులకు సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని మనస్తాపం చెంది ఓ విద్యార్థిని గులికలు మింగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారంలో చోటు చేసుకుంది.

'ఆన్‌లైన్‌ తరగతులకు సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని'
'ఆన్‌లైన్‌ తరగతులకు సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని'

By

Published : Sep 3, 2020, 10:15 PM IST

ఆన్‌లైన్‌ తరగతులకు సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని మనస్తాపం చెంది ఓ విద్యార్థిని గులికలు మింగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామానికి చెందిన కూరాకుల వెంకన్న- లక్ష్మి దంపతుల కూతురు కూరాకుల కావ్య డిగ్రీ చదువుతోంది. ఇటీవల ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమవడం వల్ల తనకు సెల్‌ఫోన్‌ కొనివ్వాలని తండ్రిని కోరగా ఆయన నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు.

తీవ్ర మనస్తాపానికి గురైన కావ్య గులికలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details