జగిత్యాల జిల్లా హస్నాబాద్లో విషాదం చోటుచేసుకుంది. ఎంసెట్ ఫలితాల్లో ర్యాంకు రాకపోవడం వల్ల వెంకటేశ్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ కళశాలలో ఇంటర్ పూర్తి చేసినా విద్యార్థి... ఎంసెట్ ఫలితాల కోసం ఎదిరు చూస్తున్నాడు. అయితే మంగళవారం వెలువడిన ఫలితాల్లో ర్యాంకు రాకపోవడం వల్ల మనస్తాపం చెంది ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. చల్గల్ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అందులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఎంసెట్లో క్వాలిఫై కాలేదని విద్యార్థి ఆత్మహత్య - జగిత్యాల తాజావార్తలు
చదువుల ఒత్తిడిలో మరో విద్యార్థి చిత్తయ్యాడు. మంగళవారం వెలువడిన ఎంసెట్ ఫలితాల్లో ర్యాంకు రాకపోవడం వల్ల జగిత్యాల జిల్లా హస్నాబాద్కు చెందిన వెంకటేష్ అనే విద్యార్థి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఎంసెట్లో క్వాలిఫై కాలేదని విద్యార్థి ఆత్మహత్య
విద్యార్ధి ఇంటికి రాకపోవడం వల్ల అతని కోసం కుటుంబ సభ్యులు వెతకగా... బావి వద్ద చెప్పులను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బావిలో నీటిని తోడి వెతకగా విగత జీవిగా పడి ఉన్న వెంకటేష్ మృత దేహాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఇవీచూడండి:నేపాల్ ముఠా కోసం ముమ్మర గాలింపు