ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడనే మనస్తాపంతో వసతిగృహంలో ఫ్యానుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన సాయిమనోజ్గా గుర్తించారు.
ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో విద్యార్థి ఆత్మహత్య - ఏపీలో విద్యార్థుల ఆత్మహత్యలు తాజా వార్తలు
ట్రిపుల్‌ఐటీలో పరీక్షలో ఫెయిల్ అయ్యాడనే మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వసతిగృహంలో ఫ్యానుకు ఉరివేసుకొని మరణించాడు. ఆ విషాదకర ఘటన ఏపీలోని కడప జిల్లా ఇడుపులపాయలో జరిగింది.

ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
శుక్రవారం పీ1 సెకెండ్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల్లో ఫెయిల్ అవ్వటంతో వసతిగృహంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని సాయిమనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇడుపులపాయ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.