ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాయ మాధారంలో వేద పాఠశాల విద్యార్థి గురువు మందలించాడనే కారణంతో కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పు గోదావరి జిల్లా వి.ఆర్.పురం మండలం రేఖపల్లికి చెందిన యామిని శేషు(18).. రెండేళ్లుగా రాయ మాధారంలోని ఓ వేద పాఠశాలలో శిక్షణ పొందుతున్నాడు. ఈ నెల 1న రాత్రి పాఠశాలలో చోటుచేసుకున్న ఓ సంఘటనపై గురువు మందలించాడు.
వేద పాఠశాలలో గురువు మందలించారని విద్యార్థి ఆత్మహత్య - తెలంగాణ తాజా వార్తలు
వేదాలు నేర్చుకుని ప్రయోజకుడు అవుతాడనుకున్న కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వేద పాఠశాలలో గురువు మందలించారనే కారణంతో కాలువలో దూకాడు. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది.

గురువు మందలించాడని విద్యార్థి ఆత్మహత్య
మనస్తాపం చెందిన ఆ విద్యార్థి పాఠశాల సమీపంలోని కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలువలో దూకిన శేషు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తిమ్మారావుపేట సమీపంలో అతని మృతదేహం లభ్యమైంది. ఈ నేపథ్యంలో అతని కుటుంబ సభ్యులు కన్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి :దొంగతనం చేస్తుండగా దొరికిపోయారు.!
TAGGED:
rayamadharam news today