తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పాస్టర్ ముసుగులో మోసం... న్యాయం కోరుతూ బాధితురాలి ఆందోళన.. - గంటూరులో ఆందోళనలు

ఇంటి పక్కనే ఉండే మల్లెలరాజు అనే పాస్టర్ తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడని ఏపీలోని గుంటూరుకు చెందిన ఓ బాధితురాలు వాపోయింది. 'నేను లాయర్​ను, మా బాబాయ్ అడిషనల్ డీజీపీ, మా అన్నయ్య మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షుడు' అంటూ నిందితుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ.. గుంటూరు అంబేడ్కర్ విగ్రహం వద్ద విద్యార్థి సంఘాలతో కలిసి నిరసన చేపట్టారు.

పాస్టర్ ముసుగులో మోసం... న్యాయం కోరుతూ బాధితురాలి ఆందోళన
పాస్టర్ ముసుగులో మోసం... న్యాయం కోరుతూ బాధితురాలి ఆందోళన

By

Published : Nov 22, 2020, 10:45 PM IST

పాస్టర్ ముసుగులో మోసం... న్యాయం కోరుతూ బాధితురాలి ఆందోళన

పాస్టర్ ముసుగులో ఓ విద్యార్థిని మోసగించిన మల్లెల రాజు అనే వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, ఐద్వా సభ్యులు, హ్యూమన్ రైట్స్ హైరా సభ్యులు డిమాండ్ చేశారు. ఏపీలోని గుంటూరు లాడ్జి సెంటర్​లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇంటి పక్కనే ఉండే మల్లెలరాజు అనే పాస్టర్ తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడని బాధితురాలు వాపోయారు. తనకు ఓ యువకుడితో మల్లెల రాజే స్వయంగా వివాహం జరిపించి సంవత్సరం వ్యవధిలోనే విడాకులు ఇప్పించడాని ఆరోపించింది. తన నగ్న చిత్రాలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడని.. తన వద్ద రూ.4 లక్షల నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్నాడని తెలిపింది. దీనిపై ఈనెల 18న నల్లపాడు పోలీసులకు, దిశ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

'నేను లాయర్​ను, మా బాబాయ్ అడిషనల్ డీజీపీ, మా అన్నయ్య మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షుడు' అంటూ నిందితుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు తెలిపింది. మల్లెల రాజును తక్షణమే అరెస్ట్ చేసి బాధితురాలికి న్యాయం చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి అరుణ కుమారి, హ్యూమన్ రైట్స్ హైరా ఏపీ చీఫ్ మీనా డిమాండ్ చేశారు.

ఇదీచదవండి:'ఓటేయకుండా ప్రశ్నించే, విమర్శించే హక్కు ఏ పౌరునికి లేదు'

ABOUT THE AUTHOR

...view details