హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంగా నిషేధిత డ్రగ్స్ (స్టెరాయిడ్స్)ను సరఫరా చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు. చాదర్‌ఘాట్ పీఎస్ పరిధిలో నివసించే ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. చాంద్రాయణగుట్ట జూబ్లీ కాలనీలో ఉండే మహమ్మద్ షా ఫహాద్(28), చంచల్‌గూడ కాలనీలో ఉండే షేక్ అబ్దుల్ ఒవైసీ(20)లను అదుపులోకి తీసుకున్నారు.
నిషేధిత డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టు - drugs
స్టెరాయిడ్స్‌ను సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 150 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
నిషేధిత డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టు
బహిరంగ మార్కెట్లో 1.5 లక్షలు విలువ చేసే 150 ఇంజెక్షన్లను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను చాదర్‌ఘాట్ పోలీసులకు అప్పగించారు. పాతబస్తీలోని వివిధ జిమ్‌లలో ఈ నిషేధిత డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని సమాచారం.
ఇవీ చూడండి: మట్కా ఆడుతున్న 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు