తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సేవలందిస్తున్నారు... నగలు దోచుకుంటున్నారు.. - కరోనా రోగుల నుంచి బంగారం చోరీ

కరోనా రోగుల నుంచి ఏకంగా సిబ్బందే నగలు దొంగలిస్తూ పట్టుబడిన ఘటన గాంధీ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. చికిత్స కోసం వచ్చిన వారి దగ్గర తమ చేతి వాటం చూపిస్తూ సిబ్బంది పట్టుబడ్డారు. అధికారులు స్పందించి.. దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టాలని పేషెంట్లు కోరుతున్నారు.

staff-robbery-gold-from-corona-patients-in-gandhi-hospital
సేవలందిస్తున్నారు... నగలు దోచుకుంటున్నారు..

By

Published : Sep 7, 2020, 7:40 PM IST

కరోనా సోకి శారీరకంగా బాధపడుతున్న రోగులకు... గాంధీ ఆస్పత్రిలో మరో ఆందోళన తోడైంది. వైరస్ బారిన పడి చికిత్స తీసుకునేందుకు ఓ మహిళా గాంధీ ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. మరణం అనంతరం ఆమె మెడలో పుస్తెల తాడు కనిపించలేదంటూ... ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం సాయంత్రం ఓ మహిళ దగ్గర వార్డు బాయ్స్​ నగలు దొంగలిస్తుండగా... గమనించిన కొందరు పేషెంట్లు ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ముగ్గురు వార్డు బాయ్స్​ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కొవిడ్​ వార్డుల్లో పనిచేసే సిబ్బంది... విధిగా పీపీఈ కిట్లు ధరించి విధులు నిర్వహించాల్సి ఉంది. ఇదే అదనుగా భావించి... తమను ఎవరూ గుర్తు పట్టలేరని కొందరు సిబ్బంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. కరోనా పేషేంట్ల నుంచి బంగారు, వెండి నగలు, మొబైల్​ ఫోన్లు చోరీ చేస్తున్నారు.

మీ వాళ్ళు బయట ఉన్నారని... మీ నగలు, మొబైల్​ ఫోన్లు ఇవ్వమన్నారని చెప్పి తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. అధికారులు స్పందించి ఇంటి దొంగలపై నిఘా పెట్టి, సీసీ కెమెరా వ్యవస్థను పటిష్టం చేయాలని రోగులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:అక్షరాస్యతలో కేరళ ప్రథమం​- ఆంధ్ర అధమం​

ABOUT THE AUTHOR

...view details