కృష్ణా జిల్లా కొండపల్లికి చెందిన వెంకటేశ్వర్లు, తిరుమల భార్య భర్తలు. వీరు ఆరు నెలలుగా తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రామన్నపేట, వలిగొండ, భువనగిరి ప్రాంతాల్లో తిరుగుతూ రెండు మూడు రోజుల పాటు కంది, పెసర, మినప్పప్పు అమ్ముతూ... తిరిగి ఊరికి వెళ్లిపోయేవారు. ఆ క్రమంలో భువనగిరి మండలం అనాజీపురంలో టిఫిన్ తినేవారు. అలా హోటల్ యజమని ఐలయ్యతో పరిచయం పెంచుకున్న దంపతులు, 2 రోజుల క్రితం... తమ వద్ద బంగారు ఒడ్డాణం ఉందని, డబ్బులు అవసరం ఉండి రూ.25 వేలకే అమ్ముతామని ఐలయ్యకు చెప్పారు. తనకు అవసరం లేదని, తన తమ్ముని ఇంట్లో పెళ్లి ఉందని అతన్ని పిలిపించాడు.
ఐలయ్య తమ్ముడు శ్రీను... దంపతులకు వెయ్యి రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చి, ఒడ్డాణంలోని చిన్న ముక్కను తీసుకున్నాడు. కంసాలి వద్ద పరీక్షించిన తరువాత మొత్తం డబ్బులు చెల్లిస్తానని చెప్పాడు. కంసాలి పరీక్షిస్తే అది నకిలీ బంగారమని తేలిపోతుందని భయపడి అక్కడి నుంచి దంపతులిద్దరూ జారుకున్నారు. బాధితులకు అది నకిలీ బంగారం అని తెలిసి... పోలీసులకు ఫిర్యాదు చేశారు.