తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కుటుంబ కలహాలతో భార్యాభర్తల బలవన్మరణం - కాకినాడలో భార్యాభర్తలు ఆత్మహత్య వార్తలు

కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగింది. అమ్మానాన్న ఫోన్ తీయడంలేదని అనుమానమొచ్చిన... కుమార్తె ఇంటికి వెళ్లి చూసే సరికి ఇద్దరు విగత జీవులుగా పడిఉన్నారు.

family
కుటుంబ కలహాల కారణంగా ఏపీలో భార్యాభర్తల ఆత్మహత్య...

By

Published : Aug 11, 2020, 7:40 PM IST

కుటుంబ కలహాల కారణంగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాకినాడ 49వ డివిజన్ రాజేశ్వరి నగర్​లో నివసిస్తున్న వల్లభాపురపు దుర్గాప్రసాద్, వెంకట పద్మావతి ఆదివారం అర్ధరాత్రి సమయంలో తమ నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

దుర్గాప్రసాద్ ఏడాది కాలంగా ఏ పని లేకుండా ఇంట్లోనే ఖాళీగా ఉండడంతో .. భార్యాభర్తలిద్దరికి తరుచూ గొడవలు జరుగుతుండేవి. వెంకట పద్మావతి బ్యూటీ పార్లర్ నిర్వహిస్తుండగా ... కరోనా వల్ల ఆ వ్యాపారం మందగించి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దీనితో ఇరువురి మధ్య తగాదాలు నెలకొన్నాయి. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తెకు వివాహం చేసి అత్తగారింటికి పంపారు. చిన్న కుమార్తె రాధిక కాకినాడ గ్రామీణ ఇంద్ర పాలెంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. రాధిక సోమవారం ఉదయం ఫోన్ చేస్తే అమ్మనాన్న ఇద్దరూ స్పందించకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూసింది. తల్లి బెడ్రూంలోను, తండ్రి వంట గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.


ఇదీ చూడండి:కరోనా అనుమానం: ఫ్యానుకు ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details