బాలుడి హత్య... దానమయ్య గుట్టలో ఎస్పీ కోటిరెడ్డి - మహబూబాబాద్ బాలుడి హత్య కేసు
బాలుడు దీక్షిత్ రెడ్డిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన... అన్నారం గ్రామ సమీపంలోని దానమయ్య గుట్టును మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. ఫోరెన్సిక్, వైద్య బృందాలతో ఘటనాస్థలి నుంచి ఆధారాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. మందసాగర్ అనే వ్యక్తి బాలుడిని... అత్యంత కిరాతంగా హత్య చేసినట్లు తెలిపిన ఎస్పీ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని కోటిరెడ్డి వివరించారు.
బాలుడి హత్య: దానమయ్య గుట్టను పరిశీలించిన ఎస్పీ కోటి రెడ్డి