తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బాలిక హత్య కేసులో ఇద్దరి అరెస్టు - నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎస్పీ అపూర్వ రావు

మామిడి తోటలో బాలిక హత్య కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వివరాలను ఎస్పీ అపూర్వ రావు మీడియాకు వివరించారు.

sp apurva rao press meet on murder case at chennaravupally nagarkurnool
బాలిక హత్య కేసులో ఇద్దరి అరెస్టు

By

Published : Apr 30, 2020, 11:59 AM IST

నాగర్​కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చెన్నాపురావుపల్లికి చెందిన బాలికతో కల్వకోల్ గ్రామానికి చెందిన సాయి కృష్ణ రెండేళ్లుగా సఖ్యతతో ఉంటున్నాడు. 20 రోజుల క్రితం కొల్లాపూర్ మండలం చింతలూరు గ్రామానికి చెందిన మరో అమ్మాయితో సాయికృష్ణకు నిశ్చితార్థం జరిగింది.

ఈక్రమంలో బాలిక అభ్యంతరం చెబుతుందని బావించిన సాయికృష్ణ ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని అనుకున్నాడు. ఆ పనిని విజయ్​కి అప్పగించాడు. సోమవారం ఆ యువకుడు యువతిని తీసుకువచ్చి వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి సమీపంలో ఉన్న మామిడి తోట వద్ద వదిలి వెళ్ళాడు.

పెళ్లి విషయమై బాలిక, సాయి కృష్ణ మధ్య మాటలు నడిచాయి. నన్ను మర్చిపోవాలని తనకు మరో అమ్మాయితో నిచ్చితార్థం జరిగిందని సాయి కృష్ణ యువతి చెప్పాడు. కొంతసేపటికి యువతి తాను శీతల పానీయంలో విషం కలుపుకొని తాగానంటూ యువకుడిపై పడిపోయింది.

పక్క తోటలో ఉన్న బాబు సాయంతో ఆమెను పెబ్బేర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. శీతల పానీయాన్ని ఎవరు తెచ్చారు? యువతే తెచ్చుకుందాం? లేక సాయికృష్ణే బలవంతంగా శీతల పానియాన్ని యువతికి తాగించాడా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని ఎస్పీ చెప్పారు. నిందితులు ఇద్దరు ఆ బాలికకు బంధువులే. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:ప్రైవేట్‌ వైద్య విద్యాసంస్థలకూ నీట్‌

ABOUT THE AUTHOR

...view details