హైదరాబాద్ బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు వద్ద నగర ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. రహదారులపై శబ్ద కాలుష్యానికి కారణమవుతోన్న ద్విచక్ర వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు.
ఈ నెలలో ఇప్పటి వరకు 1,134 శబ్ద కాలుష్యానికి సంబంధించిన కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బైకులు కొనే సమయంలో ఉన్న సైలెన్సర్లను తీసివేసి.. ఎక్కువ శబ్దం వచ్చే వాటిని అమర్చుకుంటున్నట్లు గుర్తించామన్నారు.