పేకాట స్థావరాలపై ఎస్ఓటీ పోలీసుల దాడులు - పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
యాదాద్రి భువనగిరి జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎస్ఓటీ పోలీసులు పేకాట స్థావరాలపై వరుస దాడులు కొనసాగిస్తున్నా... జూదరులు మాత్రం రెచ్చిపోతున్నారు. జిల్లాలోని పలు చోట్ల రహస్యంగా పేకాట ఆడుతున్నారు. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా... భయం లేకుండా పోయింది.

పేకాట స్థావరాలపై ఎస్ఓటీ పోలీసుల దాడులు
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం సోమారంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. పేకాట ఆడుతున్న 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారి నుంచి రూ. 30,070 నగదు, 20 సెట్ల ఫ్లైయింగ్ కార్డ్స్, 12 మొబైల్స్ స్వాధీనం చేసుకొని రాజపేట పోలీసులకు అప్పగించారు.