మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడలోని న్యూఐ మాత హోల్‌సేల్ దుకాణంపై మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. గుడ్‌నైట్ కంపెనీ వారి ఫిర్యాదు మేరకు తాముు తనిఖీలు నిర్వహించామని అధికారులు వెల్లడించారు.
నగరంలోని ఓ దుకాణంపై ఎస్ఓటీ పోలీసుల దాడులు - హైదరాబాద్ నేర వార్తలు
ఓ ప్రముఖ సంస్థకు చెందిన వస్తువుల పేరుతో నకిలీ వస్తువులను అమ్ముతోన్న హోల్‌సేల్ దుకాణంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
నగరంలోని ఓ దుకాణంపై ఎస్ఓటీ పోలీసుల దాడులు
దుకాణం నుంచి 60 నకిలీ గుడ్ నైట్ రీఫిల్స్, పవర్ యాక్టివ్ రిఫీల్స్ ప్యాక్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. దుకాణం యజమానిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'జల్లి కట్టు'కు తమిళనాడు ప్రభుత్వం అనుమతి