ఆసుపత్రి బిల్లు విషయంలో తండ్రి మందలించాడని అనారోగ్యంతో ఉన్న కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరిగింది. అపెండిసైటిస్ చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన తాళ్లరేవుకు చెందిన మండవల్లి సత్య వెంకట కృష్ణను.. హాస్పిటల్ బిల్లు విషయంలో వృథా ఖర్చు ఎక్కువయిందని తండ్రి మందలించాడు.
ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య.. ఎందుకో తెలుసా? - కాకినాడ తాజా వార్తలు
ఆసుపత్రి బిల్లు ఎక్కువ వచ్చిందని తండ్రి మందలించాడు. మనస్తాపానికి గురైన కుమారుడు ఆత్యహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగింది.
ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?
మనస్తాపానికి గురైన బాలాజీ చెరువు సెంటర్లోని సాయిసుధ ఆసుపత్రి 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం నిండు ప్రాణాలు బలి కొనటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషయంపై కాకినాడ మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:35 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్