తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కన్న కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన తల్లి - latest crime news in warangal urban district

కుమారుని వేధింపులు తాళలేక ఓ తల్లి కన్న కొడుకుని హత్య చేసిన ఘటన వరంగల్​లో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

son murdered by mother in warangal urban district
దారుణం: కొడుకును చంపిన తల్లి

By

Published : Sep 23, 2020, 9:45 AM IST

వరంగల్​లోని ఖిలా వరంగల్ పడమరకోటకు చెందిన రాజేందర్ మద్యానికి బానిసయ్యాడు. డబ్బుల కోసం తల్లితో తరచుగా గొడవ పడేవాడు. ఈ క్రమంలో తల్లికి కుమారునికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మనస్తాపానికి గురైన తల్లి నిద్రమత్తులో ఉన్న కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది.

రాజేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తన సోదరుడు ఎలా మృతి చెందాడని తెలుసుకునేందుకు తమ్ముడు మిల్స్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది. వేధింపులు తాళలేక రాజేందర్ హత్య చేసినట్లు తల్లి ఒప్పుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:ప్రియుడి మోజులో పడి భర్త ప్రాణాలు తీసిన భార్య

ABOUT THE AUTHOR

...view details