ఆన్లైన్ క్లాసులపై శ్రద్ధ పెట్టమంటూ తల్లి మందలించగా బాలుడు ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మహబూబ్‌నగర్‌కు చెందిన మహేందర్ గుప్తా.. తన కుటుంబంతో కేపీహెచ్‌బీ నాలుగో ఫేజులో నివసిస్తున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న వారి కుమారుడు ఎస్.భవిత్ ఆన్లైన్ క్లాసుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నందున తల్లి సంతోషి మందలించింది. మనస్తాపంతో భవిత్ మంగళవారం ఇల్లు విడిచి వెళ్లాడు.
తల్లి ఆన్లైన్ క్లాసులు వినమన్నందుకు ఇల్లు వదిలేశాడు!
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆన్లైన్ క్లాసులపై శ్రద్ధ పెట్టమంటూ తల్లి మందలించగా బాలుడు ఇల్లు వదిలివెళ్లియాడు. తాను తిరుపతిలో ఉన్నానని ఫోన్ చేయగా.. పోలీసుల సహాయంతో తల్లిదండ్రులు అక్కడకు పయనమయ్యారు.
తల్లి ఆన్లైన్ క్లాసులు వినమందంటూ ఇల్లు వదిలేశాడు!
భవిత్ కనిపించకపోగా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా తాను తిరుపతిలో ఉన్నానని బాలుడు ఫోన్ చేయగా అతన్ని వెనక్కి తీసుకువచ్చేందుకు పోలీసులతో కలిసి తల్లిదండ్రులు తిరుపతి వెళ్లారు. గురువారం సాయంత్రానికి వారు ఇంటికి చేరే అవకాశముందని కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు.
ఇదీ చదవండిఃహాథ్రస్ ఘటనపై వివరణ ఇవ్వండి: ఎన్‌హెచ్‌ఆర్సీ