తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భార్య కాపురానికి రాలేదని.. తల్లిని హతమార్చిన తనయుడు!

క్షణికావేశంలో ఓ కుమారుడు తల్లిని గొంతు నులిమి హతమార్చిన సంఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శాఖాపూర్​లో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.

son killed mother at shakhapur village
వనపర్తి జిల్లాలో తల్లిని చంపిన కుమారుడు

By

Published : Oct 24, 2020, 7:32 AM IST

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శాఖాపూర్​ గ్రామానికి చెందిన శ్రీనివాసులుకు.. కొత్తకోట మండలం పామాపురం గ్రామానికి చెందిన పద్మతో పదిహేనేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్ని రోజుల నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. తరచూ గొడవ పడటం వల్ల వారం రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈనెల 21న శ్రీనివాసులు అత్తగారింటికి వెళ్లి పద్మను కాపురానికి రావాలని కోరగా ఆమె నిరాకరించింది.

ఆవేశంతో ఇంటికి వచ్చిన శ్రీనివాసులు.. తల్లి సాయమ్మ(70)ను గొంతు నులిమి హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ మల్లికార్జున రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details