తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పిల్లనిచ్చిన మామనే గొడ్డలితో నరికి చంపిన అల్లుడు - hasanparthi murder case

అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తెను రోజూ అల్లుడు కొడుతుంటే చూడలేక... ఇదేం అన్యాయం అంటూ మామ ప్రశ్నించాడు. కోపోద్రిక్తుడైన అల్లుడు మామని గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ ఘటన వరంగల్​ అర్బన్​ జిల్లా హసన్​పర్తి మండలం పెద్దచెరువులో జరిగింది.

పిల్లనిచ్చిన మామనే గొడ్డలితో నరికి చంపిన అల్లుడు
పిల్లనిచ్చిన మామనే గొడ్డలితో నరికి చంపిన అల్లుడు

By

Published : Oct 15, 2020, 11:00 PM IST

ఎంతో ప్రేమగా పెంచుకున్న మొక్కకు ఏమైనా అయితేనే ప్రాణం అల్లాడి పోతుంది. అలాంటిది అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను రోజూ అల్లుడు చిత్రహింసలు పెడుతుంటే చూస్తూ ఏ తండ్రి అయినా ఊరుకోగలడా... బిడ్డను ఎందుకు కొడుతున్నావని ప్రశ్నించినందుకే ఓ వ్యక్తి తన అల్లుడి చేతిలో హత్యకు గురయ్యాడు.

వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి మండలం పెద్ద చెరువులో గత వారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిని వరంగల్​ గ్రామీణ జిల్లా నడికుడి మండలం కంఠాత్మకూర్​కు చెందిన ఎల్లయ్యగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో అల్లుడే హంతకుడిగా నిర్ధరించారు. కుమార్తెను సరిగ్గా చూడట్లేదని మామ ప్రశ్నించడం వల్ల ఆవేశంలో హత్య చేశానని విచారణలో నిందితుడు చెప్పాడని పోలీసులు తెలిపారు. ఘటనలో నిందితుడు వెంకటేష్​ను అరెస్ట్ చేసి... గొడ్డలి, ద్విచక్రవాహనం స్వాధీనపరుచుకున్నారు.

ఇదీ చూడండి:ఇంటికి కన్నం వేసిన ఫేస్​బుక్ మిత్రుడు

ABOUT THE AUTHOR

...view details