ఆస్తి కోసం.. కన్నతల్లికే కొరివి పెట్టకుండా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు ఓ కుమారుడు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన రాజారత్నం అనే మహిళ.. కుటుంబ కలహాల వల్ల బంటుమల్లిలోని కుమార్తె వద్ద ఉంటూ.. మృతి చెందింది. కుమారుడితో తలకొరివి పెట్టించుకోవాలన్న ఆమె కోరిక మేరకు .. మచిలీపట్నంలోని ఇంటికి తీసుకొచ్చారు. తీరా తెచ్చాక.. కుమారుడు వరప్రసాద్ వారిపై ఆగ్రహించి అంత్యక్రియలు చేయడానికి నిరాకరించాడు. అంతేకాకుండా మృతదేహాన్ని బయటే వదిలేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు.
తల్లికి తలకొరివి పెట్టకుండా ఇంటికి తాళం వేసి వెళ్లిన కుమారుడు - machilipatnam news
ఆస్తి కోసం కన్నతల్లి దహన సంస్కారాలు నిర్వహించకుండా అక్కడే వదిలేసి వెళ్లిపోయాడో కుమారుడు. కుటుంబ కలహాలతో తన కుమార్తె వద్ద జీవిస్తున్న ఆ వృద్ధురాలు.. అక్కడే ప్రాణాలు విడిచింది. ఆమె కోరిక మేరకు దహన సంస్కారాల కోసం.. కుమారుని వద్దకు మృతదేహాన్ని తీసుకురాగా.. అంత్యక్రియలు చేయకుండా.. ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు.
తల్లికి తలకొరివి పెట్టకుండా ఇంటికి తాళం వేసి వెళ్లిన కుమారుడు
ఆస్తి కోసం తన అక్క, బావే తల్లిని చంపేసి ఇంటికి తెచ్చారంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆస్తి కోసం మృతదేహాన్ని వదిలేసి వెళ్లిపోవటం చర్చనీయాంశంగా మారింది.