తెలంగాణ

telangana

By

Published : Dec 11, 2020, 6:04 AM IST

ETV Bharat / jagte-raho

పబ్జీ అడనివ్వలేదనే కోపంతో కుమారుడు ఆత్మహత్య

పబ్జీ గేమ్ ప్రాణాలను హరిస్తోంది. పబ్జీకి బానిసలైన వారిని ఆ గేమ్ ఆడొద్దని వారించినందుకు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల తరచుగా చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా వికారాబాద్‌ జిల్లాలో ఇలాంటి దారుణమే జరిగింది. పబ్జీ ఆటపై మోజు ఓ బాలుడి ప్రాణం బలి తీసుకుంది.

Son commits suicide in anger on pubg game at vikarabad district
పబ్జీ అడనివ్వలేదనే కోపంతో కుమారుడు ఆత్మహత్య

పబ్జీ గేమ్ మరో విద్యార్థి ప్రాణాలను బలి తీసుకుంది. తండ్రి.. ఫోన్‌లో పబ్జీ అడనివ్వలేదనే కోపంతో కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బండ వెల్కిచర్ల గ్రామంలో జరిగిన ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి :ఆశ్రమంలో అగ్నిప్రమాదం.. రూ.2 కోట్ల ఆస్తి నష్టం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details