ఏపీలోని అనంతపురం జిల్లా కనగానపల్లె మండలం మామిళ్ళపల్లిలో నారాయణస్వామి అనే వ్యక్తిని ఆయన కుమారుడు గణేశ్, కోడలు దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో నిద్రపోతున్న నారాయణస్వామిపై గణేశ్ కొడవలితో దాడి చేశాడు. హత్యకు గణేశ్ భార్య కూడా సహకరించింది. తీవ్రగాయాలతో నారాయణస్వామి మృతి చెందారు. నారాయణస్వామికి ఇద్దరు కుమారులు కాగా గణేశ్ చిన్న కుమారుడు.
ఆస్తి కోసం భార్యతో కలిసి తండ్రిని కిరాతకంగా హత్య - అనంతపురం జిల్లా వార్తలు
ఆస్తి విషయంలో కన్న తండ్రినే హత్యచేశాడో కిరాతకుడు. భార్యతో కలిసి తండ్రిని కొడవలితో దారుణంగా చంపాడు. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా మామిళ్ళపల్లిలో జరిగింది. హత్య అనంతరం నిందితులు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
రెండు రోజుల క్రితమే హైదరాబాద్ నుంచి నారాయణస్వామి మామిళ్ళపల్లికి వచ్చారు. నర్సరీ వ్యాపారం చేస్తూ నారాయణస్వామి జీవనం సాగిస్తున్నారు. తనకు ఆస్తి ఇవ్వలేదని గణేశ్ తండ్రితో గొడవ పడ్డాడని, తండ్రిని అడ్డు తప్పిస్తే ఆస్తి దక్కుతుందని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ ఘటనాస్థలిని పరిశీలించారు. హత్యానంతరం నిందితులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి :అమ్మా..ఇంటికిపోదాం.. తల్లి మృతదేహం వద్ద పసివాడు..