నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాద్వార్‌లో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న తల్లిదండ్రులపై కుమారుడు గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లిదండ్రులకు తీవ్రగాయాలయ్యాయి. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. అర్ధరాత్రి సమయంలో కుమారుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
నిద్రిస్తున్న తల్లిదండ్రులపై గొడ్డలితో దాడి చేసిన కుమారుడు
07:51 October 27
నిద్రిస్తున్న తల్లిదండ్రులపై గొడ్డలితో దాడి చేసిన కుమారుడు
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాద్వార్ గ్రామానికి చెందిన పల్లె గుంటి వెంకటేశ్ గత కొంత కాలంగా మతిస్థిమితం కోల్పోయి తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడు. సోమవారం రాత్రి తల్లిదండ్రులు పడుకున్న సమయంలో వచ్చి విచక్షణా రహితంగా గొడ్డలితో నరికాడు. తీవ్ర గాయాలపాలై కొట్టుమిట్టాడుతున్న తల్లిదండ్రులను చిన్న కుమారుడు హుటాహుటిన మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
వెంకటేశ్‌కు మతిస్థిమితం కోల్పోవడం వల్ల హైదరాబాద్ ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స చేయించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాములు తెలిపారు.
ఇదీ చదవండి:వెనుకనుంచి ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ...వ్యక్తి మృతి