తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మంత్రాల నెపంతో వృద్ధుడికి దేహశుద్ధి - yadadri bhuvanagiri district latest news

మంత్రాల నెపంతో వృద్ధుడికి దేహశుద్ధి చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం దూది వెంకటాపురంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

somebody attack on old man in yadadri bhuvanagiri district
మంత్రాల నెపంతో వృద్ధుడికి దేహ శుద్ధి

By

Published : Aug 25, 2020, 9:53 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం దూది వెంకటాపురంలో ఓ వృద్ధుడిని మంత్రాల నెపంతో కొట్టారు. గ్రామానికి చెందిన నాగారం సిద్ధులు అనారోగ్యంతో మరణించాడు. ఆయన మృతికి ఇదే గ్రామానికి చెందిన, నడిమింటి ఎల్లయ్య కారణమని ఆరోపిస్తూ సిద్ధులు బంధువులు, కొందరు యువకులు ఎల్లయ్యను చెట్టుకు కట్టేసి చితకబాదారు.

ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని, అక్కడున్న కొంతమందిని చెదరగొట్టారు. గాయపడిన ఎల్లయ్యను స్థానిక ఆరోగ్య కేంద్రానికి, అక్కడ నుంచి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నర్సయ్య తెలిపారు. ఘటన స్థలాన్ని ఏసీపీ నర్సింహారెడ్డి సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి-బంగాల్ బరి: 'మోదీ' అస్త్రంతోనే దీదీపై గురి!

ABOUT THE AUTHOR

...view details