ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో సహా పాణ్యం మండలం కౌలూరు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనపై విచారణ జరపాలని పలువురు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. పోలీసుల వేధింపులు భరించలేక సలాం కుటుంబం ఆత్మహత్య పాల్పడిందని వారు పేర్కొన్నారు.
సార్....నేను ఏ తప్పు చేయలేదు: ఆత్మహత్యకు ముందు డ్రైవర్ ఆవేదన - రైలుకింద పడి ఓ కుటుంబం ఆత్మహత్య
ఏపీలోని నంద్యాలకు చెందిన ఓ కుటుంబం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై విచారణ జరపాలని పలువురు డిమాండ్ చేస్తూ... పలువురు ఆందోళన చేపట్టారు. వారు ఆత్మహత్యకు ముందు మాట్లాడిన సెల్పీ వీడియో లభించింది. ఈ వీడియోలో తాను ఏ తప్పు చేయలేదని మృతుడు పేర్కొన్నాడు.
సార్....నేను ఏ తప్పు చేయలేదు: ఆత్మహత్యకు ముందు డ్రైవర్ ఆవేదన
వారు ఆత్మహత్యకు ముందు మాట్లాడిన వీడియో లభించింది. తాను ఎలాంటి దొంగతనం చేయలేదని అబ్దుల్ సలాం వీడియోలో చెప్పాడు. సలాం నడిపే ఆటోలో ఓ ప్రయాణికుడికి చెందిన 70వేల రూపాయలు పోయాయి. ఈ సంఘటన పై పోలీసులు స్టేషనుకు తరచూ రమ్మని వేధించారని సలాం వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:సైకో తండ్రి... ఇద్దరు కుమార్తెల గొంతు కోసి చంపేందుకు యత్నం