అన్లైన్ బెట్టింగ్‌లతో అప్పులపాలై... తీర్చలేక ఉరేసుకుని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవర్మనరణానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఠాణా పరిధిలో జరిగింది. చైతన్యనగర్ కాలనీకి చెందిన రవికుమార్ బెంగళూరు ఇన్ఫోసిస్ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసేవాడు. లాక్డౌన్ మూలంగా గతేడాది మే నెల నుంచి వర్క్ ఫ్రం హోంలో భాగంగా ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. రవికుమార్ అంతర్జాలంలో బెట్టింగ్‌లకు పాల్పడేవాడు. ఈ క్రమంలో చాలా అప్పులపాలయ్యాడు.
ఆన్లైన్ బెట్టింగులతో అప్పులపాలై... తీర్చలేక ఆత్మహత్య - suicide latest news
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్‌లతో అప్పుల్లో కూరుకుపోయిన యువకుడు... వాటిని ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపంతో ఉరేసుకున్నాడు.
ఈ విషయం తండ్రికి తెలిసి లక్ష రూపాయల అప్పు తీర్చాడు. ఇంకా చాలా అప్పులు ఉండటం వల్ల... ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మధ్యాహ్నం సమయంలో రవికుమార్ తన పడకగదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. వేలాడుతున్న కొడుకును చూసిన తల్లి... పక్కింటివారి సాయంతో చీర కోసి కిందికి దింపింది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా... అక్కడి నుంచి పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి పంపారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే... చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.