ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తున్న వివాహిత అదృశ్యమైన ఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రాజస్థాన్‌కు చెందిన పృథ్వీ సింగ్, మింటు రాజపుత్ దంపతులు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడ్‌బండ్ వద్ద నివాసం ఉంటున్నారు. వీరికి ఇటీవలే వివాహం కాగా.. 15 రోజులకు ఒకసారి రాజస్థాన్‌లోని వారి తల్లిదండ్రులను చూసొచ్చేవారు. ఈ క్రమంలో లాక్డౌన్ విధించినప్పటి నుంచి మింటు రాజపుత్ రాజస్థాన్‌కు వెళ్లకపోవటం వల్ల ఆమె సోదరుడు జితేందర్ మింటును తీసుకెళ్లడానికి తాడ్‌బండ్‌కు వచ్చాడు.
సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తున్న వివాహిత అదృశ్యం - missing cases latest update\
ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తున్న వివాహిత అదృశ్యమైన ఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తున్న వివాహిత అదృశ్యం
రాజస్థాన్‌కు విమానంలో వెళదామని మింటు ప్రతిపాదించడం వల్ల జితేందర్ సరే అన్నాడు. తీరా విమానాశ్రయానికి వెళ్లే సరికి విమానం మిస్ కావడంతో బస్సులో వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. జితేందర్ బస్సు టికెట్లు బుక్ చేస్తున్న క్రమంలో మింటు కనబడకుండా పోయింది. తన సోదరి కోసం చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడం వల్..ల జితేందర్ వెంటనే బోయిన్పల్లి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.