మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట ఠాణా పరిధి మహదేవపురం విషాదం జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉరివేసుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య - మేడ్చల్ జిల్లాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లా మహదేవపురంలో జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. సాయిరెడ్డి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఉరివేసుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న సాయిరెడ్డి... తల్లితో కలిసి మహదేవపురంలో ఉంటున్నాడు. ఇంట్లో తల్లి లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి:మృతదేహాన్ని తన్నిన కానిస్టేబుల్.. జిల్లా హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్