తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దారుణ హత్య.. బంధువులపైనే అనుుమానం

భార్య బలవన్మరణం కేసులో బెయిల్‌పై బయటకొచ్చిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి హత్యకు గురైన ఘటన  ఆల్విన్​ కాలనీలో చేటు చేసుకుంది. భార్య తరఫు వారే మాటు వేసి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Software Employ Murdered in hyderabad
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దారుణ హత్య.. బంధువులపైనే అనుుమానం

By

Published : Oct 12, 2020, 12:08 PM IST

గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కేశన చంద్రశేఖర్​ రాజు, మచిలీపట్నంకు చెందిన లక్ష్మీ గౌరికి 2019లో వివాహమైంది. నాలుగెకరాల భూమి, రూ.40 లక్షలు కట్నంగా ఇచ్చారు. వివాహానంతరం చంద్రశేఖర్​ నగరంలోని ఆల్విన్​ కాలనీలో కాపురం పెట్టాడు. కొద్దిరోజుల తర్వాత లక్ష్మీగౌరి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వరకట్న వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని.. బంధువులు చేసిన ఫిర్యాదు మేరకు జగద్గిరి గుట్ట పోలీసులు చంద్రశేఖర్​తో పాటు.. అతడి తల్లిదండ్రులు వెంకట కృష్ణారావు, ఝాన్సీలక్ష్మిలపై 304బి సెక్షన్​ కింద కేసు నమోదు చేశారు.

ఇటీవల బెయిల్​పై విడుదలైన చంద్రశేఖర్​ తల్లి, సోదరుడితో కలిసి ధరంకరం రోడ్డులోని పద్మశ్రీ అపార్ట్‌మెంట్‌లో మేనమామ ఇంట్లో ఉంటున్నాడు. గత నాలుగు రోజులుగా అతని కదలికల మీద నిఘా వేసి.. ఆదివారం ఉదయం 9.30 గంటలకు చికెన్‌ తీసుకురావడం కోసం బయటకు వచ్చిన చంద్రశేఖర్​ను సెల్లార్​లో కత్తులతో దారుణంగా హత్య చేశారు. మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. హత్యను చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎస్సార్‌నగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. బంజారాహిల్స్‌ ఏసీపీ కె.ఎస్‌.రావు, సీఐ సైదులు, డీఐ అజయ్‌కుమార్‌, ఎస్సై భాస్కర్‌రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ ఫుటేజీల ద్వారా కీలక ఆధారాలు సేకరించారు. హత్యలో లక్ష్మీగౌరి దగ్గరి బంధువుల ప్రమేయం ఉందని పోలీసులు నిర్ధారించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించినట్టు తెలిపారు.

ఇవీ చూడండి:'11 తేదీకి జీతాలు రాకపోవడం ఆర్టీసీ చరిత్రలోనే ప్రథమం'

ABOUT THE AUTHOR

...view details