తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

స్నేహలత హత్య కేసులో నిందితుల అరెస్ట్ - telangana news

అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన స్నేహలత హత్యకేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని ధర్మవరం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.

snehalatha-murder-case-accused-remanded-for-14-days-at-anantapur-district
స్నేహలత హత్య కేసులో నిందితుల అరెస్ట్

By

Published : Dec 25, 2020, 9:37 AM IST

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లి వద్ద జరిగిన స్నేహలత హత్య కేసులో నిందితులైన రాజేష్, నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్నేహలత ఆమె పై ఉన్న అనుమానంతోనే రాజేష్ ఈ హత్యకు పాల్పడ్డాడని వివరించారు. వారిని ధర్మవరం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులను ప్రత్యేక పోలీసు వాహనంలో పెనుకొండ సబ్ జైలుకు తరలించారు.

సంవత్సర కాలంగా స్నేహలతతో ప్రేమ వ్యవహారం నడిపిన రాజేష్‌... ఇటీవల ఆమె మరో వ్యక్తితో చనువుగా ఉందనే అనుమానం పెంచుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే మాట్లాడాలని పొలాల్లోకి తీసుకెళ్లి హత్య చేశాడని పేర్కొన్నారు. పోలీసులు సకాలంలో స్పందించ లేదన్న స్నేహలత తల్లి ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.

ఇవీ చూడండి...

భాగ్యనగరంలో గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details