ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్ ట్రాన్స్ఫార్మర్కు చెందిన కేబుల్ వద్ద మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. వెంటనే స్పందించిన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడం వల్ల పెను ప్రమాదం తప్పింది.
ఏపీ: మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో స్వల్ప అగ్ని ప్రమాదం - Machkhand Hydroelectric Power Station fire accident
ఏపీ విశాఖపట్నం జిల్లాలోని మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
![ఏపీ: మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో స్వల్ప అగ్ని ప్రమాదం small-fire-accident-at-machkhand-hydroelectric-power-station-in-vishakhapatnam-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8618459-51-8618459-1598799099844.jpg)
ఏపీ: మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో స్వల్ప అగ్ని ప్రమాదం
విషయం తెలుసుకున్న ప్రాజెక్ట్ ఎస్ఈ నాగేశ్వరరావు, ఈఈ రమణయ్య సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ప్రాజెక్ట్ పరిధిలో గల మాచ్‌ఖండ్, ఓనకడిల్లి, జోలపుట్ క్యాంపులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనంతరం అధికారుల చొరవతో విద్యుత్ పునరుద్ధరించారు.
ఏపీ: మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో స్వల్ప అగ్ని ప్రమాదం
ఇదీ చూడండి :నేడు ఈసెట్ పరీక్ష... కరోనా కాలంలో తొలి పరీక్ష