నిర్మాణంలో ఉన్న భవనం రెండో అంతస్తు స్లాబ్ కూలిపోయిన ఘటనలో పదిమంది కార్మికులకు గాయాలయ్యాయి. గచ్చిబౌలి ఎస్సై నవీన్‌రెడ్డి వివరాల ప్రకారం.. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ జిల్లా ప్రాంతంలో ఓ సంస్థ బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తోంది. రెండో అంతస్తులో ఆదివారం మధ్యాహ్నం పైకప్పు(స్లాబ్) కోసం కాంక్రీట్ వేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో పది మంది కార్మికులకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
కాంక్రీట్ వేస్తుండగా కూలిన స్లాబ్.. పది మందికి గాయాలు - accident at Gachibowli
నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ జిల్లా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం రెండో అంతస్తు స్లాబ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 10 మందికి కార్మికులకు గాయాలయ్యాయి. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాంక్రీట్ వేస్తుండగా కూలిన స్లాబ్.. పది మందికి గాయాలు
క్షతగాత్రుల్ని వెంటనే వారిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శ్రవణ్, సురేష్, రాజన్‌కుమార్, రాజ్‌కుమార్, జయప్రకాశ్, రాంసింగ్, సందీప్, సాగర్‌తోపాటు మరో ఇద్దరు గాయపడిన వారిలో ఉన్నారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టీఎస్‌ఐఐసీ, జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
ఇవీ చూడండి:బంగారం పట్టివేత కేసులో విచారణ ముమ్మరం