సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో విషాదం చోటుచేసుకుంది. ఊహించని రోడ్డు ప్రమాదం ఆరేళ్ల బాలుడి నూరేళ్ల జీవితాన్ని చిదిమేసింది. తండ్రి స్నేహితుడు ఉపేందర్‌తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన తిరుమలగిరి క్రాస్ రోడ్డులో జరిగింది.
ఆరేళ్ల బాలుడిని బలితీసుకున్న లారీ - రోడ్డు ప్రమాదంలో బాలుడు దుర్మరణం
ఊహించని రోడ్డు ప్రమాదం ఆరేళ్ల బాలుడిని బలితీసుకుంది. ద్విచక్రవాహనంపై బయలుదేరిన కాసేపటికే మృత్యువు కబళించింది. తండ్రి స్నేహితుడు ఉపేందర్‌తో కలిసి దుకాణానికి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో తలకు తీవ్రగాయాలై బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి క్రాస్ రోడ్డులో జరిగింది.
ఆరేళ్ల బాలుడిని బలితీసుకున్న లారీ
తిరుమలగిరికి చెందిన కూరగాయల వ్యాపారి దిలీప్, శ్రావణిల కుమారుడు దిశాంత్(6) ఈ ప్రమాదంలో మరణించాడు. లారీ వెనుక చక్రాల కింద పడడంతో బాలుడి తలకు తీవ్ర గాయాలై మృత్యువాత పడ్డాడు.