తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆరుగురు దొంగలు అరెస్ట్.. బంగారం, నగదు స్వాధీనం​ - పీవీ కాలనీ కూడలిలో పోలీసులు వాహనాల తనిఖీలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పీవీ కాలనీ కూడలిలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. పారిపోతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం ఆరుగురు కలిసి దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అతనితో సహా మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి 6.2 తులాల బంగారం, 3లక్షల 50వేల నగదు, ఆటో, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Six robbers arrested at Manuguru in Bhadradri Kothagudem district, gold and cash seized
ఆరుగురు దొంగలు అరెస్ట్.. బంగారం, నగదు స్వాధీనం​

By

Published : Feb 6, 2021, 9:26 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ భాను ప్రకాశ్​, ఎస్సై నరేశ్​ పీవీ కాలనీ కూడలిలో వాహనాలు తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో ఆటో దిగి పారిపోతున్న గంటా ప్రవీణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

చల్లా రాము, బండారు భరత్, అక్కినపల్లి సాంబశివరావు, అక్కినపల్లి సతీశ్​తో కలిసి ఏడాది కాలంగా పలు ఇళ్లలో ప్రవీణ్ చోరీలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలిందని ఏఎస్పీ శుభరీశ్​ వెల్లడించారు. వారి నుంచి 6.2 తులాల బంగారం, 3లక్షల 50వేల నగదు, ఆటో, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.

చోరీ చేసిన బంగారాన్ని సుందరయ్య నగర్​కు చెందిన సాగర్ అనే వ్యక్తికి విక్రయించారని.. మొత్తం ఐదు చోట్ల చోరీలకు పాల్పడ్డారని ఏఎస్పీ పేర్కొన్నారు. చోరీ కేసును ఛేదించేందుకు కృషిచేసిన సీఐ, ఎస్సైలతోపాటు సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు.

ఇదీ చూడండి: గోదాంలో అగ్నిప్రమాదం... డెకరేషన్​ సామగ్రి దగ్ధం

ABOUT THE AUTHOR

...view details