డీజిల్ దందాలో పోలీసుల పాత్ర.. ఆరుగురిపై వేటు - రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వార్తలు
15:06 May 30
డీజిల్ దందాలో పోలీసుల పాత్ర.. ఆరుగురిపై వేటు
రాచకొండ కమిషనరేట్ పరిధిలో అక్రమ డీజిల్ దందాకు సహకరిస్తున్న పోలీసులపై వేటు పడంది. ఏకంగా ఆరుగురిని సస్పెండ్ చేస్తూ సీపీ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండైన వారిలో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఉండటం గమనార్హం. మేడిపల్లి ఠాణా పరిధిలో ట్యాంకర్ల నుంచి అక్రమంగా డీజిల్ తీస్తున్న ముఠాను పోలీసులు ఈ నెల18న అరెస్ట్ చేశారు. వీరిని విచారిస్తే అక్రమ దందాలో పోలీసుల హస్తం బయటపడింది.
రాచకొండ సీపీ మహేశ్ భగవత్ డీజిల్ దందాపై అంతర్గత విచారణ జరిపించారు. నిజమని తేలగా.. ఆరుగురిని సస్పెండ్ చేశారు. వేటు పడిన వారిలో ఎస్ఓటీ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, ఎస్బీ కానిస్టేబుల్‌తో పాటు.. మేడిపల్లి ఠాణాలో పనిచేసే ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు. అంతర్గత దర్యాప్తు కొసాగుతూనే ఉందని సీపీ తెలిపారు. ఇతర పోలీసుల పాత్రపైనా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.
ఇవీ చూడండి:ప్రైవేట్ వాళ్లెలా తీస్తారు బొగ్గు.. భగ్గుమన్న కార్మిక లోకం