భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలకోసం ప్రయత్నించిన ఓ ముఠాను భద్రాచలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఐదుగురు, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నకిలీ తుపాకీ, రెండు ఇనుపరాడ్లు, తాళాలు, కట్టర్ స్వాధీనం చేసుకున్నారు.
గుప్త నిధుల తవ్వకాలకు యత్నం...అరెస్ట్ చేసిన పోలీసులు - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా సమాచారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గుప్తనిధుల తవ్వకాలకు యత్నించిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక నకిలీ తుపాకీ, రెండు ఇనుప రాడ్లు, తాళాలు, కట్టర్ స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
గుప్త నిధుల తవ్వకాలకు యత్నం...అరెస్ట్ చేసిన పోలీసులు
పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఓ షాపు ముందు కారు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు తనిఖీ చేశారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి పట్టణంలోని రాజుపేటలో ఓ ఇంట్లో గుప్తనిధులు ఉన్నట్లు చెప్పాడని దర్యాప్తులో వెల్లడైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కారును సీజ్ చేసి... నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ వినీత్ వెల్లడించారు.