వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి శివారులో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలయ్యాయి. దుగ్గొండి మండలం పొనకల్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు కూచన రమేష్... కుటుంబ సభ్యులతో కలిసి నర్సంపేట పట్టణంలోని ఓ ఫంక్షన్కు వెళ్లాడు.
టైరు పేలి చెట్టును ఢీకొన్న కారు.. ఆరుగురికి గాయాలు - కారు ప్రమాదం వార్తలు
ఓ శుభకార్యానికి వెళ్లి... సంతోషంతో కుటుంబసభ్యులంతా తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం టైరు పేలింది. అదుపుతప్పిన కారు నేరుగా పెద్ద చెట్టును ఢీకొన్నది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
టైరు పేలి చెట్టును ఢీకొన్న కారు.. ఆరుగురికి గాయాలు
తిరుగు ప్రయాణమవ్వగా లక్నేపల్లి శివారు వద్ద కారు ముందు టైరు పగలి... అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పెద్ద చెట్టును ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు పిల్లలు ఉన్నారు. అప్రమత్తమైన స్థానికులు... కారు నుంచి క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:స్విఫ్ట్ కారు, ద్విచక్రవాహనం ఢీ... ఒకరు మృతి