తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అన్నను రోకలిబండతో కొట్టి హతమార్చిన చెల్లెలు

మద్యానికి బానిసై ఆస్తి ఇవ్వమని తల్లిని వేధిస్తున్న అన్నను చెల్లి హతమార్చిన ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా రేగులగడ్డలో జరిగింది. మద్యం తాగొచ్చి తల్లిపై చేయి చేసుకోబోయిన అన్నను రోకలిబండతో కొట్టి చంపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

sister-killed-brother-in-regulagadda-guntur-district
అన్నను రోకలిబండతో కొట్టి హతమార్చిన చెల్లెలు

By

Published : Sep 20, 2020, 10:38 PM IST

మద్యానికి బానిసై ఆస్తి ఇవ్వమని తల్లిని వేధిస్తున్నాడనే కారణంతో అన్నను చెల్లెలు హతమార్చింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఏపీలోని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం కండ్రిక శివారు రేగులగడ్డకు చెందిన గుంజి నాగమ్మ, వెంకటేశ్వర్లు దంపతులకు పోతురాజు, ఆదిలక్ష్మి ఇద్దరు సంతానం. వారిద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. పోతురాజు మద్యం తాగుతున్నాడనే కారణంతో అతని భార్య దూరంగా ఉంటోంది. ఇక ఆదిలక్ష్మి వివిధ కారణాలతో భర్త నుంచి దూరమై కొన్నేళ్లుగా తల్లి వద్ద ఉంటోంది.

ఈ క్రమంలో పోతురాజు మద్యం తాగి రోజూ తల్లిని, చెల్లెలిని ఇబ్బంది పెడుతున్నాడు. కొద్దిరోజులుగా ఆస్తి రాసివ్వమని తల్లి నాగమ్మను వేధిస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు మద్యం తాగొచ్చి తల్లితో వాగ్వాదం పెట్టుకున్నాడు. ఆమెపై చేయి చేసుకోబోయాడు... ఇదంతా చూసిన ఆదిలక్ష్మి.. తల్లిని ఏం చేస్తాడోననే భయంతో పక్కనే ఉన్న రోకలిబండతో పోతురాజు తలపై కొట్టింది. దీనితో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి: దొంగను చితకబాదిన ఆలయ కమిటీ సభ్యులు

ABOUT THE AUTHOR

...view details