కలుగొట్ల వాగులో ప్రమాదవశాత్తు పడి కొట్టుకుపోయిన సింధూ రెడ్డి ఆచూకీ లభించింది. ఈనెల 25న జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెళ్లి మండలం కలుగొట్ల వాగులో సింధూ కొట్టుకుపోయింది. పోలీసులు, గ్రామస్థులు... వాగులోను, తుంగభద్ర నదిని అణువణువు గాలించారు.
వాగులో గల్లంతైన సింధూరెడ్డి... తుంగభద్రలో దొరికిన మృతదేహం - తెలంగాణ నేర వార్తలు
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెళ్లి మండలం కలుగొట్ల వాగులో ప్రమాదవశాత్తు పడి కొట్టుకుపోయిన సింధూ రెడ్డి మృతదేహం లభ్యమైంది. కర్నూలు సంకల్పబాగ్ వద్ద తుంగభద్ర నదిలో మృతదేహాన్ని గుర్తించారు.
వాగులో గల్లంతైన సింధూరెడ్డి... తుంగభద్రలో దొరికిన మృతదేహం
ఇవాళ కర్నూలు సంకల్పబాగ్ సమీపంలో తుంగభద్ర నదిలో గుర్తించారు. మత్స్యకారుల సాయంతో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. నదిలో గల్లంతైన బిడ్డ శవమై తేలిన బిడ్డ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీ చూడండి: రెండు రోజులు గడుస్తున్నా లభించని సింధూ ఆచూకీ
Last Updated : Jul 27, 2020, 7:02 PM IST