సిద్ధిపేట జిల్లా సిద్ధిపేటలో గుట్కా ప్యాకెట్లని అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరిపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి రూ. 70 వేల విలువ చేసే గుట్కా ప్యాకెట్లని స్వాధీనం చేసుకున్నారు.
గుట్కా ప్యాకెట్లు స్వాధీనం.. కేసు నమోదు - తెలంగాణ నేర వార్తలు
గుట్కా ప్యాకెట్లను అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరిపై సిద్ధిపేట టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని వారి ఇళ్లలో నుంచి రూ. 70 వేల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం.. కేసు నమోదు
మహాశక్తి నగర్‌లో నివసించే ఇద్దరు కలిసి గుట్కా ప్యాకెట్లని ఇళ్లలో దాచి అక్రమంగా వ్యాపారం చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో సోదాలు నిర్వహించారు. 14 గన్ని బ్యాగుల్లో 765 గుట్కా ప్యాకెట్లని స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.