తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఎస్సై విధులకు ఆటంకం... నిందితుల అరెస్ట్​ - విధులకు ఆటంకం కలిగించారని ఎస్సై ఫిర్యాదు

విధులకు ఆటంకం కలిగించారని 12 మందిపై మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి ఎస్సై ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన తొర్రూరు ఎస్సై.. 12 మందిలో తొలుత ముగ్గురిని అరెస్టు చేసి జిల్లా కోర్టులో హాజరు పరచారు.

si complent on some villagers in mahabubabad district
ఎస్సై విధులకు ఆటంకం కలిగించిన కేసులో నిందితుల అరెస్ట్​

By

Published : Feb 2, 2021, 11:25 AM IST

మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లాడలో బొడ్డుపల్లి వెంకన్న, కుందూరు శ్రీనివాస్‌ రెడ్డి అనే ఇద్దరి మధ్య గత కొంత కాలంగా భూ వివాదం నడుస్తోంది. గత నెల 30న వివాదంలో ఉన్న భూమిలోకి ప్రవేశించారంటూ వెంకన్నను శ్రీనివాస్‌ రెడ్డి ప్రశ్నించారు. కాగా వెంకన్న వర్గానికి చెందిన వారు శ్రీనివాస్‌రెడ్డిపై దాడి చేయగా అతడు పోలీసులకు సమాచారం అందించారు.

అక్కడున్న ఇరువర్గాల వారిని చెదరగొట్టే సమయంలో గ్రామానికి చెందిన పలువురు తన చేతిలోని చరవాణిని లాక్కున్నారని దంతాలపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై బానోత్‌ వెంకన్న ఫిర్యాదు చేశారు. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని, విధులకు ఆటంకం కలిగించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే రోజు హెడ్‌కానిస్టేబుల్‌ కృష్ణ.. బాధ్యులైన 12 మందిపై కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ బాధ్యతను తొర్రూరు ఎస్సైకి అప్పగించారు. విచారణ చేపట్టిన సదరు ఎస్సై 12 మందిలో తొలుత ముగ్గురిని అరెస్టు చేసి జిల్లా కోర్టులో హాజరు పరచారు.

ఇదీ చదవండి:నిమ్మాడలో ఉద్రిక్తత.. అచ్చెన్నాయుడు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details