'ఆ ఎస్సై నమ్మించి గదికి పిలిచాడు.. ఇప్పుడు మోసం చేశాడు' - ఎస్సైపై మహిళ ఫిర్యాదు... మోసం చేశాడంటూ ఆరోపణ
హన్మకొండలోని సుబేదారి పోలీస్స్టేషన్లో విధులు నిర్వహించిన ఎస్సైపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేశాడంటూ బాధితురాలు ఆరోపించింది.
పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ ఎస్సై మోసం చేశాడంటూ... హన్మకొండలోని సుబేదారి పోలీస్స్టేషన్లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. కొద్ది నెలల కింద... వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్స్టేషన్లో విధులు నిర్వహించిన ఎస్సై... తనను పలుమార్లు గదికి పిలిపించుకుని చనువుగా ఉండేవాడని తెలిపింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి... మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సదరు ఎస్సై.... వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పని చేయడం లేదని తెలిసింది. బదిలీపై వేరే జిల్లాకు వెళ్లినట్టు సమాచారం.