సికింద్రాబాద్ చిలకలగూడ పరిధిలోని మహ్మద్గూడలో అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతం వల్ల ఓ అపార్టుమెంటులోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను రావడాన్ని గమనించిన ఇంట్లో వాళ్లు భయపడి బయటకు పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు.
చిలకలగూడలోని అపార్టుమెంటులో విద్యుదాఘాతం...మంటల్లో బూడిదైన సామాగ్రి - అపార్టుమెంటులో అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్లోని చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ అపార్టుమెంటులో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుదాఘాతానికి మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
![చిలకలగూడలోని అపార్టుమెంటులో విద్యుదాఘాతం...మంటల్లో బూడిదైన సామాగ్రి short circuit in an apartment in Chilakaluguda in secunderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9697172-744-9697172-1606569572283.jpg)
చిలకలగూడలోని అపార్టుమెంటులో విద్యుదాఘాతం...మంటల్లో బూడిదైన సామాగ్రి
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఇంట్లోని వస్తువులు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. అపార్టుమెంట్పైన ఉన్న టవర్ల రేడియేషన్ వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు.