హైదరాబాద్‌లో పేరొందిన క్లాత్ షోరూంలో పనిచేస్తున్న సంపత్, భాను చందర్‌ను యజమానులు చితకబాదారు. విచక్షణ రహితంగా కొట్టడం వల్ల తీవ్ర గాయాలపాలయ్యారు. బాధితులు ఉప్పల్‌లోని షోరూంలో ఫ్లోర్ ఇంచార్జ్, క్యాష్యర్గా పని చేస్తున్నారు.
చితకబాదారు: ఉద్యోగస్తులపై కార్పొరేట్ సంస్థ పైశాచికత్వం - anutext latest news
కార్పొరేట్ సంస్థలో పనిచేస్తున్న పాపానికి ప్రాణం పోయే పరిస్థితి తలెత్తింది. లావాదేవీల్లో తేడా జరిగిందనే నెపంతో ఉద్యోగులను చితకబాదిన ఘటన హైదరాబాద్‌లోని కుషాయిగూడలో జరిగింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఉద్యోగస్తులపై కార్పొరేట్ సంస్థ పైశాచికత్వం
అకౌంట్లో తేడా వచ్చిందనే నెపంతో వారిని ఏఎస్ రావు నగర్ తీసుకెళ్లి చేతులు వెనక్కి కట్టి ఇనుప రాడ్లు, కర్రలతో ప్రాణాలు పోయేలా కొట్టారు. సంపత్, భాను చందర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. యజమానులైన పులవర్తి నాగేశ్వరరావు, పులవర్తి రాజశేఖర్, పులవర్తి రామకృష్ణ రావును కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:హరితహారంలో కేసీఆర్.. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ప్రారంభించిన సీఎం