నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం కేంద్రంలో 45 గొర్రెలు ఒకేసారి మృతి చెందాయి. నలుగురు రైతులు కలిసి మేత కోసం 600 గొర్రెలను పొలంలోకి తీసుకెళ్లగా... పత్తి చేనులో తిని 45 జీవాలు మృత్యువాత పడ్డాయని బాధితులు తెలిపారు.
విషాదం: పత్తి చేను తిని... 45 గొర్రెలు మృత్యువాత - నాగర్ కర్నూల్ జిల్లా తాజా వార్తలు
మేత కోసం తీసుకెళ్లిన గొర్రెలు ఒక్కసారిగా 45 మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. పత్తిచేనులో తిని గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

విషాదం: పత్తి చేను తిని... 45 గొర్రెలు మృత్యువాత
పశువైద్యులు ప్రథమ చికిత్స అందించి కొన్నింటిని రక్షించారు. దాదాపు రూ.2 లక్షల వరకు నష్టం జరిగిందని బాధితులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి:ఏటీఎం దొంగతనంలో ఇద్దరి అరెస్టు.. పరారీలో మరో నలుగురు