మహిళలు, యువతులను వేధించే పోకిరీలను షీ టీం పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మూడు నెలల వ్యవధిలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 74మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 38 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించగా 33 మందిపై సాధారణ కేసు నమోదు చేసి వదిలి పెట్టారు. మరో 6 మందికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.
షీటీం పోలీసులు అరెస్ట్ చేసిన వాళ్లలో ఎంబీబీఎస్ విద్యార్థి కూడా ఉన్నాడు. ఉప్పల్ ప్రాంతంలో నివసించే పాలగంటి సాయి కుమార్ తన ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాల ఆధారంగా సాయికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. 13ఏళ్ల బాలికతో కూడా ఇలాగే ప్రవర్తించినట్లు నిర్ధారించుకున్న పోలీసులు.. ఆ విద్యార్థిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.