తప్పుడు పత్రాలతో గుర్తింపు పొందిన కళాశాలలను పూర్తిగా మూసివేయాలని ఎస్ఎఫ్ఐ ఆందోళన చేపట్టింది. న్యాక్ అక్రిడేషన్ గుర్తింపు కోసం నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన మంత్రి మల్లారెడ్డికి చెందిన కళాశాలల గుర్తింపు రద్దు చెయ్యాలంటూ కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ ప్రధాన ద్వారం ఎదుట విద్యార్థి నాయకులు మంగళవారం ధర్నా చేపట్టారు.
'మల్లారెడ్డి కళాశాలల గుర్తింపు రద్దు చేయాలి' - తెలంగాణ వార్తలు
తప్పుడు పత్రాలతో గుర్తింపు పొందిన కళాశాలలను మూసివేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన అన్ని కళాశాలల గుర్తింపు వెంటనే రద్దు చేయాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు.

'మంత్రి మల్లారెడ్డి కళాశాలల గుర్తింపు రద్దుచేయాలి'
మంత్రి హోదాలో కొనసాగుతూ ఆయనకు చెందిన కళాశాలల గుర్తింపు కోసం తప్పుడు పత్రాలు సమర్పించడమే కాకుండా... పత్రాలు సరైనవేనని ప్రచారం చేస్తున్న మంత్రి మల్లారెడ్డిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నకిలీ పత్రాలతో గుర్తింపు తెచ్చుకొని అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి:గుజరాత్లో భాజపాకు షాక్- ఎంపీ రాజీనామా