డీఎంహెచ్ఓ లైంగికంగా వేధిస్తున్నారు: వైద్యురాలు - lady doctor complain on bhupalpally dmho
భూపాలపల్లి డీఎంహెచ్ఓ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ వైద్యాధికారిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
![డీఎంహెచ్ఓ లైంగికంగా వేధిస్తున్నారు: వైద్యురాలు sexual harassment case against bhupalpally district medical health officer](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7470932-1082-7470932-1591261388920.jpg)
భూపాలపల్లి డీఎంహెచ్‌ఓపై లైంగిక వేధింపుల కేసు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్యాధికారి డాక్టర్ గోపాల్రావుపై ఓ వైద్యాదికారిణి ఫిర్యాదు చేశారు. డీఎంహెచ్ఓ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు వైద్యురాలు వరంగల్‌కు తనను డిప్యుటేషన్‌పై పంపమని ఒత్తిడి తీసుకువచ్చారని డీఎంహెచ్ఓ గోపాల్ రెడ్డి తెలిపారు. కరోనా కాలంలో డిప్యుటేషన్ కుదరదని చెప్పడం వల్ల కోపంతో ఇలా చేసి ఉండొచ్చన్నారు. వైద్యాధికారిణి ఫిర్యాదుతో ఘనపూర్ పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
- ఇదీ చూడండి:'మార్కెట్లో అమ్ముడుపోయే పంటలే పండించాలి'