తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఎనిమిదేళ్ల బాలికపై పదహారేళ్ల బాలురు లైంగిక దాడి - bhadradri crime news

భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో ఎనిమిదేళ్ల బాలికపై పదహారేళ్ల బాలురు ఇద్దరు.. లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇంటి బయట బాలిక ఆడుకుంటున్న సమయంలో దారుణానికి ఒడిగడ్డారు. విషయం తెలిసిన స్థానికులు బాలురకు దేహశుద్ది చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

rape attempt on girl
ఎనిమిదేళ్ల బాలికపై పదహారేళ్ల బాలురు లైంగిక దాడి

By

Published : Nov 8, 2020, 8:24 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికపై పదహారేళ్ల బాలురు ఇద్దరు లైంగిక దాడికి పాల్పడ్డారు.

ఏం జరిగింది..

బాదితురాలి తల్లి కూలి పనులకు వెళ్లింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బాలిక ఇంటి బయట ఆడుకుంటుంది. గమనించిన బాలురు.. బాలికను సమీపంలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇంటికి వచ్చిన తల్లితో జరిగిన దారుణాన్ని చెప్పింది. ఈ విషయాన్ని గ్రామస్థులకు చెప్పింది బాదితురాలి తల్లి. ఆగ్రహించిన గ్రామస్థులు ఇరువురు బాలురకు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సీఐ ఉపేందర్​, ఎస్సై మధుప్రసాద్​ ఘటనా స్థలికి వెళ్లి విచారణ చేపట్టారు. బాలికను వైద్య పరీక్షలకు తరలించారు. లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీచూడండి:ఫోన్ కాల్ ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీదేవి.. ఏమన్నారంటే..?

ABOUT THE AUTHOR

...view details